Melu Cheyaka Neevu Undalevayya – మేలు చేయక నీవు ఉండలేవయ్య

మేలు చేయక నీవు ఉండలేవయ్య
ఆరాధించక నేను ఉండలేనయ్య
యేసయ్యా యేసయ్యా.

నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా
నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ
నిజమైన ధన్యతనాది

ఆరాధించే వేళలందు
నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో
నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి
నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి
కనుగొంటిని నీతో చేరి

పాపములు చేసాను నేను
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు
ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ
నిన్నే కలిగి ఉన్నందుకు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment